తారక రత్న నూతన చిత్రం ప్రారంభం


తారక రత్న మరియు మాధవి లతలు ప్రధాన పాత్రలో ఒక చిత్రం మొదలయ్యింది. “చూడాలని చెప్పాలని ” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పార్ధవన్ దర్శకత్వం వహిస్తుండగా నాగమల శంకర్ ఈ చిత్రాన్ని శ్రీ శివ శంకర్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ సోమవారం హైదరాబాద్ లో మొదలయ్యింది. ప్రసన్న కుమార్ స్విచ్ ఆన్ చెయ్యగా తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్ర తాకిని 35 రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ చిత్రంలో నందమూరి తారకరత్న వైవిధ్యమయిన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం యూత్ ఫుల్ చిత్రంగా తెరకెక్కనుంది. అమర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version