ఆయన ప్రశంశ కంటే మించిన అవార్డ్ లేదు.!

Tanikella-bharani
విలక్షణ నటుడు, ఫిల్మ్ మేకర్ అయిన తనికెళ్ళ భరణి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘మిథునం’. ప్రముఖ సింగర్ ఎస్.పి బాల సుబ్రహ్మణ్యం, విలక్షణ నటి లక్ష్మీ జంటగా నటించిన ఈ సినిమాలో, తనికెళ్ళ భరణి కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 21న విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి కూడా మంచి మన్ననలు అందుకుంది. ఈ సినిమా పై తనికెళ్ళ భరణి స్పందిస్తూ ‘ ఆడియన్స్ కి నా సినేమానచ్చినదుకు నాకు చాలా ఆనదంగా ఉంది. అంతకన్నా సంతోషకరమైన విషయం ఏమిటంటే గ్రేట్ డైరెక్టర్ బాపు గారు ఈ సినిమాని చూసి ప్రశంశించడం. ఆయన దగ్గర నుంచి అందుకున్న ప్రశంశలు కంటే మించిన అవార్డు ఏమీ లేదని’ అన్నారు. ఆనంద్ మయిద రావు నిర్మించిన ఈ సినిమా శ్రీ రమణ గారు రాసిన ‘మిథునం’నవలా ఆధారంగా తెరకెక్కింది.

Exit mobile version