మహేష్ సినిమాతోనే అక్కడ థియేటర్స్ ఓపెన్ అయ్యేది

మహేష్ సినిమాతోనే అక్కడ థియేటర్స్ ఓపెన్ అయ్యేది

Published on Oct 14, 2020 10:00 PM IST


దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సినిమా థియేటర్లను రీఓపెన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను అమలుచేసే పనిలో ఉన్నాయి. తమిళనాడులో సైతం సినిమా హాళ్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. అయితే తమిళంలో ఇప్పటికిప్పుడు అన్ని పనులు పూర్తై విడుదలకు సిద్దంగా ఏ సినిమా కూడ లేదు. అందుకే అక్కడి థియేటర్ యాజమాన్యాలు డబ్బింగ్ సినిమా మీద ఆధారపడనున్నాయి.

ఆ సినిమానే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం. ఈ సినిమా యొక్క తమిళ అనువాదాన్ని మొదటగా ప్రదర్శించనున్నారు. తమిళంలో అంతమంది స్టార్ హీరోలు ఉన్నా థియేటర్లు మహేష్ సినిమాతోనే తెరుచుకోనుండటం విశేషం. మహేష్ బాబుకు తమిళ ప్రేక్షకుల్లో కూడ మంచి ఆదరణ ఉంది. ఆయన ప్రతి చిత్రం తమిళంలోకి తప్పకుండా డబ్ అవుతూ ఉంటుంది. అలా ‘సరిలేరు నీకెవ్వరు’ కూడ డబ్ అవుతోంది. ఈ యేడాది ఆరంభంలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని రికార్డ్ స్థాయి కలెక్షన్లు రాబట్టుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు