విజయ్ సేతుపతికి గట్టి షాకిచ్చిన తమిళ జనం!

విజయ్ సేతుపతికి గట్టి షాకిచ్చిన తమిళ జనం!

Published on Oct 14, 2020 8:02 AM IST

తమిళ నాట తన నటనతో ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న టాలెంటెడ్ హీరోల్లో విజయ్ సేతుపతి కూడా ఒకరు. అయితే విజయ్ పలు చిత్రాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలా సేతుపతి ఇటీవలే స్టార్ట్ చిత్రాల్లో శ్రీలంకన్ లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత చరిత్ర ఆధారంగా “800” అనే చిత్రం అనౌన్స్ చెయ్యడం మాత్రమే కాకుండా నిన్ననే మోషన్ పోస్టర్ ను అనౌన్స్ చేసారు.

ఈ విడుదల నుంచి విజయ్ సేతుపతికి తమిళ జనం నుంచి ఒక్కసారిగా అసమ్మతి సెగ రగిలింది. శ్రీలంకన్ క్రికెటర్ మీద సినిమా తీయడం నచ్చలేదని ఆ మధ్య శ్రీలంకన్లు నెలకొల్పిన విషాదమే ఇందుకు ప్రధాన కారణం అన్నట్టు తెలుస్తుంది. అందుకే సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి వల్ల పడుతున్నామని, అతని సినిమాలు బాయ్ కాట్ చెయ్యాలని హ్యాష్ ట్యాగ్స్ తో పెద్ద ట్రెండ్ చేస్తున్నారు. అలాగే విజయ్ సపోర్ట్ చేసిన వారు కూడా లేకపోలేరు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు