బాలీవుడ్ లో తమన్నా రెండవ సినిమా

Tamannah

నటి తమన్నా బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ఆశించినంత విజయాన్ని సాదించలేకపోయింది. కానీ అక్కడితో తన నటన ఆగిపోలేదు. ఆమె అక్షయ కుమార్ తో మరో సినిమాలో నటించడానికి సైన్ చేసింది. ఈ సినిమాకి తాత్కాలికంగా ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ పేరును ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబందించిన ముహూర్త కార్యక్రమాలు కొద్ది రోజులకు ముందే జరిగాయి. ఈ సినిమా ఫార్మల్ షూటింగ్ జూలై మొదటి వారం నుండి మొదలుకానుంది. ఫర్హాడ్ -సాజిద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రమేష్ ఎస్ తౌరని నిర్మిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయంపై తమన్నా చాలా నమ్మకం పెట్టుకుంది. తమన్నా తెలుగులో బెల్లంకొండ సురేష్ కొడుకు మొదటి సినిమాలో నటిస్తోంది. అలాగే నాగ చైతన్య సినిమాలో కూడా నటిస్తోంది.

Exit mobile version