తమన్నా ‘నబంబర్ స్టోరీ’ ఏమైంది ?


స్టార్ హీరోయిన్ తమన్నా సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ రంగంలోకి కూడా అడుగుపెట్టి డిజిటల్ కెరీర్ ను కూడా ఇప్పటికే చాప్టర్ స్టార్ చేసింది. ఆమె చేస్తున్న డెబ్యూ వెబ్ సిరీస్ షూటింగ్ ఇప్పటికే మొదలై కీలక షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది. ‘నబంబర్ స్టోరీ’ అనేది ఈ వెబ్ సిరీస్ పేరు. వెబ్ సిరీస్లో నటిస్తే పాత్రలో జీవించడానికి ఆస్కారం ఉంటుందన్న మిల్కీ బ్యూటీ నిజంగానే ఆ పాత్రని ఎంజాయ్ చేస్తూ చేసిందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే మళ్లీ ఆ వెబ్ సిరీస్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. మరి ఆ వెబ్ సిరీస్ లో తమన్నా నటిస్తోందా లేదా డ్రాప్ అయిందా అనే విషయం తెలియాల్సి ఉంది. రామ్ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ను తమిళ లీడింగ్ వీక్లీ మేగజైన్ ఆనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. హాట్ స్టార్ ద్వారా ఈ సిరీస్ ప్రసారం కానుంది. తండ్రి, కూతుళ్ల మధ్యన సాగే భావోద్వేగపూరితమైన జర్నీగా ఈ వెబ్ సిరీస్ ఉండనుంది.

Exit mobile version