చాలా కాలం తర్వాత తమిళంలో తమన్నా

చాలా కాలం తర్వాత తమిళంలో తమన్నా

Published on Dec 10, 2013 10:35 PM IST

tamannah-bollywood-movie

‘100% లవ్’ సినిమాలో నటించిన తమన్నా తెలుగు సినిమాలో చాలా బిజీగా మారిపోయింది. ఆ తరువాత తమిళంలో నటించలేకపోయింది. ఆమె తమిళంలో చివరిగా ధనుష్ తో కలిసి ‘వెంఘై’సినిమాలో నటించింది. ఈ సినిమా 2011లో విడుదలైంది. దాదాపు మూడు సంవత్సరాల తరువాత మళ్ళి ఆమె తమిళంలో ‘వీరం’ సినిమాలో నటిస్తోంది.

అజిత్, తమన్నా జంటగా కలిసి నటిస్తున్న ఈ సినిమాకి శౌర్యం శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది అని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా అజిత్ బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాదించాలని అనుకుంటున్నాడు. ఈ మధ్య విడుదలైన ‘ఆరంభం’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని సాదించింది. ఆ సినిమా తరువాత వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇప్పటికే సోషల్ నెట్వర్క్ లలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ప్రస్తుతం అందరి దృష్టి తమన్నా పై వుంది. ఈ సినిమాలో తను అజిత్ తో కలిసి రొమాంటిక్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత తమన్నా ఇప్పటి వరకు ఏ సినిమాకి సంతకం చేయలేదని సమాచారం. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాదిస్తే ఆ తరువుత ఆమె ఇక్కడ మరికొన్ని సినిమాలకు సంతకం చేయవచ్చు.

ప్రస్తుతం తమన్నా మహేష్ బాబు తో కలిసి ‘ఆగడు’ సినిమాలో నటిస్తోంది. అలాగే మరో రెండు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. అవి ‘హంశకల్’, ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’. ఆమె నటించిన ‘వీరం’ సినిమా జనవరి 2014లో విడుదలయ్యే అవకాశం వుంది.

తాజా వార్తలు