వి.వి వినాయక్ తీస్తున్న సినిమాలో ఒక ప్రత్యేక పాటలో నర్తించిన తమన్నా ఈరోజుతో షూటింగ్ పూర్తిచేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్, సమంతా హీరో హీరోయిన్స్. బెల్లంకొండ సురేష్ నిర్మాత.
ముందుగా ఈ సినిమాలో తమన్నాకు కూడా మంచి పాత్రను ఇచ్చినా స్క్రిప్ట్ ను మార్చాక ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. కాకపోతే ఈ టాప్ హీరోయిన్ వి.వి వినాయక్ మీద వున్న గౌరవం కోసం
ఒక పాటలో నటించడానికి అంగీకరించింది. ఈ పాట షూటింగ్ తరువాత దర్శకుడు తమన్నా నటనకు దాసోహమన్నాడు. నేను తీసిన బెస్ట్ సాంగ్స్ లో ఇది ఒకటి అని ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
నిజానికి ఇది దేవి శ్రీ ప్రసాద్ కు కుడా ఒక మంచి పాటగా నిలవనుందట
ఏప్రిల్ 1 నుండి సమంతా ఈ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. వేసవిలో ఈ సినిమా మనముందుకు రానుంది