సైఫ్ ఆలీ ఖాన్ తో జతకట్టనున్న తమన్నా

Tamanna-and-Saif
‘హిమ్మత్ వాలా’ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న తమన్నా ఆ సినిమా అన్ని విధాలా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో ఆమె ఆశలన్నీ అడిఆశాలయ్యాయి. ఆ సినిమా విడుదల వెంటనే ‘తడాఖా’ సినిమా ప్రమోషన్లో పాల్గున్న ఈ భామ ప్రస్తుతం తమిళ్ లో అజిత్ సరసన నటిస్తున్న సినిమాలో బిజీగావుంది. తాజా సమాచారం ప్రకారం ‘హిమ్మత్ వాలా’ సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్ సైఫ్ ఆలీ ఖాన్ సరసన పాత్రకు తమన్నాను తీసుకోవాలని కోరుకుంటున్నాడట. ఈ సినిమాలో గనుక తమన్నా నటిస్తే ఆమె ఈషా గుప్తా, సోనాల్ చౌహాన్ లతో స్క్రీన్ పంచుకుంటుంది. ఈ సినిమాకుగానూ మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపనున్నారు. తమన్నా అక్షయ్ కుమార్ సరసన ఒక సినిమా, బెల్లంకొండ సురేష్ తనయుడు తెలుగు తెరకు పరిచయమవుతున్న మరొక సినిమాలో నటిస్తుంది.

Exit mobile version