హిమ్మత్ వాలా చిత్రంలో అందాలతో ఆకట్టుకోనున్న తమన్నా

హిమ్మత్ వాలా చిత్రంలో అందాలతో ఆకట్టుకోనున్న తమన్నా

Published on Jan 24, 2013 10:30 PM IST

Tamanna
హిమ్మత్ వాలా చిత్రంతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి తమన్నా సిద్దమయ్యింది. ఈ చిత్రం అదే పేరుతో 1983లో వచ్చిన చిత్రానికి రీమేక్. ఆ చిత్రాన్ని తెలుగులోకి కృష్ణ మరియు జయప్రదలు ప్రధాన పాత్రలలో రాఘవేంద్రరావు “ఊరికి మొనగాడు” చిత్రంగా తీసుకువచ్చారు. ఈ చిత్రాన్ని ప్రకటించిన రోజు నుండి చిత్రంలోని ప్రముఖ పాట “నయనోం మే సప్న” రీమేక్ ఎలా ఉండబోతుంది అని అందరు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు. తమన్నా తన అందాలతో బాలీవుడ్ నిఆకట్టుకోనుందని ఈ ట్రైలర్ ద్వారా సంకేతాలు అందించింది. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చ్ 28న విడుదల కానుంది. తెలుగులో తమన్నా “వెట్టై” చిత్ర రీమేక్ లో నాగ చైతన్య సరసన నటిస్తున్నారు ఇది కాకుండా అజిత్ సరసన ఒక తమిళ చిత్రం చెయ్యనున్నారు.

తాజా వార్తలు