డేంజర్ బెల్స్ నుంచి బయటపడ్డ తమన్నా.!

డేంజర్ బెల్స్ నుంచి బయటపడ్డ తమన్నా.!

Published on Oct 15, 2020 9:00 AM IST

ఈ ఏడాది కరోనా వైరస్ ఎంత పని చేసిందో చూసాము. దీని ఉదృతి ఇంకా కొనసాగుతూ అనేకమంది సినీ పరిశ్రమకు చెందిన వారి వరకు కూడా వచ్చేసింది. ఈ ప్రమాదకారి వైరస్ బారిన పడి ఎంతో మంది లెజెండరీ తారలను కోల్పోయాము అలాగే మరికొంత మంది దాని నుంచి కోలుకొని బయటపడ్డ వారు కూడా ఉన్నారు.

అయితే గత కొన్ని రోజుల కితమే మన దక్షిణాదిలో టాప్ హీరోయిన్స్ లో ఒకరైన తమన్నా భాటియా కు కరోనా పాజిటివ్ రావడం సంచలనం రేపింది. దీనిత్ ఆమెను హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చేర్చి మెరుగైన వైద్యాన్ని అందించారు. ఇపుడు మొత్తానికి తమన్నా ఈ కరోనా డేంజర్ బెల్స్ నుంచి బయటపడినట్టుగా తెలిపింది.

హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసిన వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తాను బాగానే ఉన్నట్టుగా క్లారిటీ ఇచ్చింది. పూర్తిగా కోలుకున్న తమన్నా కారులో ఇంటికి వచ్చాక తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. గత కొన్నాళ్ల కితమే తమన్నా తల్లిదండ్రులు కూడా కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

https://www.instagram.com/p/CGVBUwejUIS/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు