విరాట్ కొహ్లితో కలిసి నటించనున్న తమన్నా

విరాట్ కొహ్లితో కలిసి నటించనున్న తమన్నా

Published on Sep 3, 2012 4:25 PM IST


మీరు విన్నది నిజమే… కానీ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. తమన్నా మరియు విరాట్ కొహ్లి కలిసి ఒక నిమిషం నిడివిగల యాడ్ లో కలిసి నటించనున్నారు. స్వతహాగా సెల్ కాన్ మొబైల్స్ కి ప్రచార కర్తలైన వీరిద్దరి పై ఒక యాడ్ చెయ్యాలని కంపెనీ ప్లాన్ చేసింది. ఈ యాడ్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నారు. త్రివిక్రమ్ గతంలో మహేష్ బాబు, రామ్ చరణ్ – ధోనీ మరియు ఎన్.టి.ఆర్ లతో యాడ్స్ చేసారు. అ యాడ్స్ కి మంచి పేరు వచ్చింది. త్వరలోనే త్రివిక్రమ్ – తమన్నా – కొహ్లి కాంబినేషన్లో యాడ్ తెరకెక్కనుంది. ఈ యాడ్ లో కూడా త్రివిక్రమ్ తన పంచ్ పవర్ చూపించనున్నాడేమో చూడాలి.

తాజా వార్తలు