“విశ్వంభర” దర్శకునితో మాస్ మహరాజ్?

Raviteja-vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో ఫాంటసీ చిత్రం విశ్వంభర కూడా ఒకటి. ఈ సినిమాని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మెగా అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దర్శకుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మాస్ మహారాజా రవితేజని లాక్ చేసుకున్నట్టు ఇప్పుడు వినిపిస్తోంది.

దర్శకుడు వశిష్ఠ చెప్పిన మరో సోషియో ఫాంటసీ కథ రవితేజకి నచ్చగా వీరి కాంబినేషన్ లాక్ అయినట్టు తెలుస్తోంది. మరి గతంలో రవితేజ చేసిన ఫాంటసీ సబ్జెక్టు “దరువు” కామెడీ పరంగా ఎలా వర్క్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఆ తరహా ట్రీట్ ఇవ్వడానికి రాబోతున్నారని చెప్పాలి. ఇక దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version