మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న అవైటెడ్ భారీ సినిమానే “పెద్ది”. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పట్ల మంచి ఆసక్తి నెలకొంది. టీం చికిరి చికిరి అంటూ ప్రకటించిన లిరిక్ కొత్తగా అనిపించడం మరింత ఆసక్తిగా మారింది.
ఇక దీనికి అర్ధం ఏంటి ఆమెది నేడు మేకర్స్ రివీల్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. దీనితో అదేంటి అని అందరి కళ్ళు ఇప్పుడు దాని కోసం వైట్ చేస్తున్నారు. మరి ఈసారి రెహమాన్ ఎలాంటి కొత్త ప్రయోగం చేశారు అనేది వేచి చూడాలి. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్, మైత్రి మూవీస్ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా పని చేస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
