హాలివుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అలాగే పాపులర్ కామిక్ సంస్థ మార్వెల్స్ నుంచి ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో “ఫెంటాస్టిక్ 4” కూడా ఒకటి. కొన్నాళ్ల నుంచి మంచి టాక్ లేక వరుస డిజప్పాయింట్ చిత్రాలుతో సతమతమవుతున్న మార్వెల్ ఫ్యాన్స్ కి ఈ సినిమా కొంచెం ఉపశమనం కలిగించి మంచి టాక్ ని అందుకుంది. అయితే ఈ సూపర్ హీరో సినిమా ఫైనల్ గా థియేటర్స్ నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.
ఈ సినిమా హక్కులు జియో హాట్ స్టార్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఒరిజినల్ ఇంగ్లీష్ సహా తెలుగు డబ్బింగ్ ఇంకా తమిళ్ భాషల్లో ఈ సినిమా వచ్చేసింది. మరి మార్వెల్ ఫ్యాన్స్ అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకుంటే డెఫినెట్ గా ఇప్పుడు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి మాట్ షక్మాన్ దర్శకత్వం వహించారు.
