పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న సాలిడ్ హారర్ కామెడీ థ్రిల్లర్ చిత్రం “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ఈ సినిమా పట్ల కూడా మంచి బజ్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అవుతుంది. అయితే ఈ చిత్రం విషయంలో రీసెంట్ గా సంగీత దర్శకుడు థమన్ చేసిన కామెంట్స్ కూడా మంచి ఆసక్తి రేపగా ఇపుడు ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్ లో ఉండకపోవచ్చు అనేది కూడా దాదాపు ఖరారు అయ్యింది.
అయితే మరి రాజా సాబ్ రాక ఎప్పుడు అనేది ఇపుడు బజ్ తెలుస్తుంది. దీనితో ఈ చిత్రాన్ని మేకర్స్ ఏప్రిల్ నుంచి జూలై నెలకి షిఫ్ట్ చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. జూలై మూడో వారానికి అలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటించగా ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.