టాక్.. ‘విశ్వంభర’లో ఐటెం భామగా నాగిని?

టాక్.. ‘విశ్వంభర’లో ఐటెం భామగా నాగిని?

Published on Jul 1, 2025 11:59 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర”. అత్యయితే చిరు నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న ఫాంటసీ సినిమా ఇది కాగా దీనిపై అప్పట్లో భారీ హైప్ నెలకొంది. కానీ ఇపుడు సినిమా షూటింగ్ అవుతున్నప్పటికీ విడుదలపై క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ఉన్నట్టుగా కొన్ని రోజులు నుంచి రూమర్స్ వినిపిస్తూ వస్తున్నాయి. ఇలా ఓ బాలీవుడ్ బ్యూటీ దగ్గరకి ఈ టాక్ చేరుకుంది. దీని ప్రకారం బాలీవుడ్ బ్యూటీ ‘నాగిని’ ఫేమ్ మౌని రాయ్ ని ఈ స్పెషల్ సాంగ్ కోసం అప్రోచ్ అయినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు