టాక్.. అనుష్క ‘ఘాటీ’ మళ్లీ వాయిదా?

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సినిమా సినిమాకి గ్యాప్ ఎక్కువ తీసుకుంటున్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తర్వాత చేసిన అవైటెడ్ సినిమానే “ఘాటీ”. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా ఇది వరకే విడుదల కావాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడి జులైకి ఫిక్స్ అయ్యింది.

కానీ ఇప్పుడు ఈ జూలై లో కూడా సినిమా వాయిదా పడినట్లు వినిపిస్తోంది. సినిమాకి ఇంకా కొన్ని పనులు బ్యాలన్స్ ఉండగా ఈ కారణం చేత వాయిదా పడినట్టు సమాచారం. ఇక కొత్త డేట్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి విద్యా సాగర్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version