సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కి భారీ ఓటిటి డీల్?

సూర్య, వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ కి భారీ ఓటిటి డీల్?

Published on Sep 14, 2025 9:04 PM IST

suriya venky atluri

ప్రస్తుతం మన టాలీవుడ్ దర్శకులు ఇతర ఇండస్ట్రీ హీరోస్ కి ఎలాంటి హిట్స్ ఇస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి దర్శకుల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఒకరు. మరి వెంకీ నుంచి నెక్స్ట్ సినిమాగా తమిళ స్టార్ హీరో సూర్యతో ఓ సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుండగా ఈ సినిమాకి ఓ భారీ ఓటిటి ధర వచ్చినట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాని లీడింగ్ ఓటిటి సంస్థ ఒకటి ఏకంగా 80 కోట్లు వెచ్చించి హక్కులు కొనుగోలు చేసినట్టుగా టాక్. ఇది మాత్రం ఈ కాంబినేషన్ కి ఒక భారీ మొత్తమే అని చెప్పాలి. మరి సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు డెలివర్ చేసిన వెంకీ అట్లూరి ఇపుడు ఎలాంటి సినిమా అందిస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆ అంచనాలు ఈ ప్రాజెక్ట్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు