టాలెంటెడ్ హీరోయిన్ కి ఛాన్స్ లు రావట్లేదట ?

టాలెంటెడ్ హీరోయిన్ కి ఛాన్స్ లు రావట్లేదట ?

Published on Mar 19, 2020 3:00 AM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ మొదటి సినిమా సక్సెస్ తరువాత, ఇండస్ట్రీలో సక్సెస్ హీరోయిన్ గా మారిపోతుందని అనుకున్నారు అందరూ. నిజానికి స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్ని పాయల్ కు ఉండటంతో.. టాలీవుడ్ లో స్టార్ హీరోలకు పాయల్ మెయిన్ ఆప్షన్ అవుతుందనుకున్నారు. కానీ, చిన్న చితకా చిత్రాలకు, సీనియర్ హీరోల పక్కన సెకెండ్ లీడ్ కే మాత్రం పరిమితం అయిపాయింది ఈ హాట్ బ్యూటీ.

కాగా తన బోల్డ్ నెస్ గ్లామర్ తో ఇండస్ట్రీ చూపును తన వైపుకు తిప్పుకున్నా చివరకు ఆమెకు మాత్రం ఒరిగిందేమి లేదు. ‘ఆర్ ఎక్స్ 100’ సంచలనాత్మక విజయం సాధించడంతో అవకాశాలు క్యూ కడతాయనుకుంటే అల జరగలేదు. ఆ మధ్య వచ్చిన వెంకీమామ సినిమా మినహా.. పాయల్ కి పెద్ద ఛాన్సే రాకుండా పోయింది. పోనీ, చిన్న హీరోల పక్కన అన్నా మెయిన్ లీడ్ వస్తున్నాయా అంటే ప్రెజెంట్ అలాంటి క్యారెక్టర్స్ కూడా పెద్దగా రావట్లేదట. పాపం పాయల్.

తాజా వార్తలు