స్మూత్ గా కిక్కిచ్చేలా ‘వీరమల్లు’ నుంచి రొమాంటిక్ డ్యూయెట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకులు క్రిష్ జాగర్లమూడి అలాగే జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రమే “హరిహర వీరమల్లు”. అయితే ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం ఫైనల్ గా ఇపుడు వస్తుంది. ఇలా ఒకొక సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేస్తుండగా లేటెస్ట్ గా సినిమా నుంచి నాలుగో సాంగ్ విడుదలకి వచ్చింది.

మరి ఈ సాంగ్ మాత్రం మంచి స్మూత్ గా కిక్కిచ్చేలా ఉందని చెప్పాలి. చాలా కాలం తర్వాత పవన్ పై ఒక రొమాంటిక్ సాంగ్ లాంటిది లేదా హీరోయిన్ తో మంచి డ్యూయెట్ లాంటివి మిస్ అవుతున్నవారికి ఇది ట్రీట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. కీరవాణి మంచి ట్యూన్ ని అందించగా శ్రీహర్ష ఈమని ఇచ్చిన సాహిత్యం కూడా బాగుంది. ఇక ఈ సాంగ్ లో లిప్సిక భాష్యం గొంతు ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి.

ఇక విజువల్స్ కూడా ఒకింత ఆశ్చర్యకరంగా ఉన్నాయని చెప్పాలి. సాంగ్ మూడ్ కి తగ్గట్టుగా సెట్ చేసిన సెట్టింగులు సాంగ్ లో కొన్ని సర్ప్రైజ్ క్యామియోలు కూడా కనిపించడం విశేషవిశేషం. ఇక నిధి అగర్వాల్ అయితే మెయిన్ ఎసెట్ అని చెప్పొచ్చు. తన గ్లామర్ ఇంకా తన డాన్స్ మూమెంట్స్ సాంగ్ లో చాలా బాగున్నాయి.

మరి పవన్ కళ్యాణ్ పై పెద్దగా వీడియో విజువల్స్ చూపించలేదు కానీ కనిపించిన కొన్ని కూడా మినిమమ్ ప్రామిసింగ్ గా ఉన్నాయని చెప్పవచ్చు. మొత్తానికి సాంగ్ అయితే బాగుంది. ఆడియెన్స్ కి కూడా బాగా నచ్చుతుంది, ఈ తరహా పాటలు ఇష్టపడే లేడీస్ కి ఇంకా నచ్చొచ్చు.. ఇక ఈ అవైటెడ్ సినిమా ఈ జూన్ 12న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version