ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!

అక్కినేని నాగ చైతన్య హీరోగా ఇప్పుడు తన కెరీర్ 24వ సినిమా దర్శకుడు కార్తీక్ వర్మ దండుతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చిన చైతూ తన బెస్ట్ హాఫ్ తో కలిసి కొంచెం సమయాన్ని డివోషనల్ గా గడుపుతున్న మూమెంట్స్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారాయి.

ఇక ఇదిలా ఉండగా చైతు మరియు తన భార్య శోభిత ధూళిపాళ తిరుమల సన్నిధిలో కనిపించి అభిమానులకి ఆనందం కలిగించారు. మరి అక్కడే తమపై ఓ బ్యూటిఫుల్ స్నాప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీవారి ప్రతిమని పట్టుకొని ఇద్దరి జంట ఎంతో చక్కగా కనిపిస్తున్నారు. ఇలా వీరి పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నాగ చైతన్య చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు భారీ బడ్జెట్ తో ఓ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version