ఐశ్వర్య ధనుష్ సినిమాలో తాప్సీ స్పెషల్ రోల్

ఐశ్వర్య ధనుష్ సినిమాలో తాప్సీ స్పెషల్ రోల్

Published on Jan 14, 2014 7:30 PM IST

Tapsee
సొట్ట బుగ్గల సుందరి తాప్సీ కోలీవుడ్ లో మరో సినిమా దక్కించుకుంది. గత సంవత్సరం ఆరంభం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తాప్సీ ప్రస్తుతం రాఘవ లారెన్స్ ‘గంగ’ సినిమాలో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఐశ్వర్య ధనుష్ సినిమాలో తాప్సీ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనుంది.

‘వై రాజ వై సినిమాలో మరో డిఫరెంట్ స్పెషల్ రోల్ చేయడానికి సిద్దమవుతున్నాను. నన్ను తీసుకున్నందుకు ఐశ్వర్య అర్జున్ కి థాంక్స్. ఈ సినిమాతో నన్ను ఊహించని విధంగా చూస్తారని’ తాప్సీ ట్వీట్ చేసాడు. వై రాజ వై లో గౌతం కార్తీక్, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందిస్తున్నాడు.

‘3’ సినిమాతో ఐశ్వర్య ధనుష్ డైరెక్టర్ గా పరిచయమైంది. తాప్సీ ప్రస్తుతం తెలుగులో ఎలాంటి సినిమా చేయడం లేదు.

తాజా వార్తలు