ఇప్పటిదాకా గ్లామర్ పాత్రలలో నటిస్తూ వస్తున్న తాప్సీ సడన్ గా నటన వైపుకి తన దృష్టిమార్చి పూర్తి వైవిధ్యమైన పాత్రలో నటించనుంది. తాను నటిస్తున్న ఒక తమిళ సినిమాలో ఒక నెగిటివ్ రోల్ చేయనుంది. వై రాజా వై సినిమాకు గానూ ఈ పాత్ర పోషించనున్నట్లు సమాచారం
ఈ సినిమాను ఐశ్వర్య ధనుష్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న తాప్సీ పై సన్నివేశాలను థాయ్ ల్యాండ్, సింగపూర్ దగ్గర ఒక క్రూజర్ లో చిత్రీకరించారు. ఈ సినిమాలో గౌతం కార్తీక్, ప్రియా ఆనంద్ లు హీరో, హీరోయిన్లు. తనపాత్ర గురించి తాప్సీ మాట్లాడుతూ “నాకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన ఐశ్వర్య ధనుష్ కి నా ధన్యవాధాలు. కాస్త నెగిటివ్ ఛాయలున్న ఈ పాత్రకు నేను న్యాయం చెయ్యగలను అని భావిస్తున్నా” అని తెలిపింది
ఈ భామ గత నెల తనమకాం హైదరాబాద్ నుండి ముంబైకి మార్చింది. ప్రస్తుతం లారెన్స్ ముని ౩ లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ మరే ఇతర తెలుగు సినిమాను అంగీకరించలేదు