మరో హిందీ సినిమాకు సంతకం చేసిన తాప్సీ

Taapsee
ఈ ఏడాది తాప్సీ హిట్టు. ఫ్లాపుల మధ్య ఊగిసలాడుతుంది, అయినా ఆమె ఖాతాలో ఏడాదికి సరిపడా మంచి ప్రాజెక్టులు వున్నాయి. ‘షాడో’ సినిమా పరాజయం పాలైనా తన మొదటిసారిగా నటించిన హిందీ చిత్రం ‘చష్మే బద్దూర్’ భారీ విజయం సాధించడంతో తిరిగి వార్తలలో నిలిచింది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు వున్నాయి. చంద్రశేఖర్ యేలేటి ‘సాహసం’, విష్ణువర్ధన్ దర్శకత్వంలో మరో సినిమా, లారెన్స్ దర్శకత్వంలో ‘గంగ’ సినిమాలలో నటిస్తుంది. ప్రముఖ పత్రికతో మాట్లడుతూ తాను మరో హిందీ సినిమాను అంగీకరించిందని తెలిపింది. ఈ సినిమా గురించి ఎక్కువ విషయాలు తెలుపకపోయినా ఆమె ఈ చిత్రంలో తన మనసుకు నచ్చిన పాత్రలో నటించనుందని, బాలీవుడ్ లో తాను ఎదురుచూస్తుంది దీనికోసమేనని తెలిపింది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలుపుతాం. ప్రస్తుతం ఆమె ‘గంగ’ షూటింగ్ కోసం చెన్నైలో వుంది. ఈ సినిమా చిత్రీకరణ మరికొన్ని రోజులలో ముగుస్తుంది

Exit mobile version