ముని 3 సెట్ లో అడుగుపెట్టనున్న తాప్సీ

ముని 3 సెట్ లో అడుగుపెట్టనున్న తాప్సీ

Published on Dec 12, 2013 3:15 PM IST

Lawrence-and-Tapsee-Muni-3
సుమారు రెండు నెలల గ్యాప్ తర్వాత సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ తిరిగి మళ్ళీ ముని 3 సెట్స్ లో అడుగుపెట్టనుంది. ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం రాఘవ లారెన్స్ కి గాయపడడంతో షూటింగ్ ఆగిపోయింది. లారెన్స్ పూర్తిగా కోలుకోవడంతో తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. ఇక తాప్సీ సెకండాఫ్ లో వచ్చే కొన్ని హర్రర్ సీన్స్ ని షూట్ చేయాల్సి ఉంది. తాప్సీ తన కెరీర్లోనే చేస్తున్న టఫ్ రోల్ అని, ఈ పాత్ర చేయడానికి ఫిజికల్ గా, ఎమోషనల్ గా మంచి స్ట్రెంగ్త్ కావాలని తాప్సీ చెప్పింది.
వచ్చే వారంలో తాప్సీ ముని 3 సినిమా సెట్స్ లో సందడి చేయనుంది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమా 2014లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఫిజికల్ హాండీకాప్ అయిన గంగ పాత్రలో నిత్యా మీనన్ కనిపించనుంది.

తాజా వార్తలు