మళ్ళీ లడఖ్ చేరుకున్న తాప్సీ

మళ్ళీ లడఖ్ చేరుకున్న తాప్సీ

Published on Aug 7, 2012 2:02 AM IST


ఈ రోజు నుండి తాప్సీ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహసోపేతమైన యాక్షన్ మూవీ చిత్రీకరణలో పాల్గొంటోంది. గోపిచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం లడఖ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది.గత నెలలో వరుసగా మూడు వారాలు విపరీతమైన వాతావరణ పరిస్థితులలో చిత్రీకరణ జరుపుకుంది. తాప్సీ తన పుట్టిన రోజు సందర్భంగా తన ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకోవాలని తాప్సీ కొద్ది రోజులు విరామం తీసుకుంది. ఈ సమయంలోనే హైదరాబాద్ కి కూడా వచ్చి కొన్ని ముఖ్యమైన పనులను కూడా పూర్తి చేసింది. ‘ మళ్ళీ లడక్ చేరుకున్నాను. ఇక్కడ ఉన్న మేఘాలు మాయమైపోయి ఎండా రావాలని కోరుకుంటున్నాను. చాలా చల్లగా ఉంది, నేను ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు లడఖ్ లో ఇలా లేదని’ తాప్సీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

గత నెలలో గోపి చంద్ మరియు తాప్సీ లపై ఎంతో సాహసంతో కూడుకున్న బుజ్కషి (అఫ్గానీల సంప్రదాయ ఆట) పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. హీరో మరియు హార్స్ రైడర్స్ మధ్య జరిగే ఈ యాక్షన్ సన్నివేశంలో తాప్సీ మధ్యలో ఉండాలి. ఇప్పటి వరకూ తన కెరీర్లో చేసిన సాహసోపేతమైన సన్నివేశం అదేనని ఆమె ఇటీవలే తెలిపారు మరియు ఈ సన్నివేశం సినిమాలో హైలైట్ అవుతుందని ఆమె అన్నారు. ఈ సినిమా కాకుండా తాప్సీ ప్రస్తుతం వెంకటేష్ సరసన ‘షాడో’ చిత్రంలో, ‘గుండెల్లో గోదారి’, అజిత్ సరసన ఒక తమిళ సినిమాలో మరియు ‘చష్మే బదూర్’ అనే ఒక హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలన్నీ ఈ సంవత్సరంలోనే విడుదల కానుండడం విశేషం.

తాజా వార్తలు