తన అభిమాన క్రికెట్ స్టార్ ను కలిసిన తాప్సీ

Tapsee2
తాప్సీ చాలా రోజుల కంటున్న కల కొద్దిరోజుల క్రితం నెరవేరింది. తాప్సీ స్కూల్ రోజుల నుండి ఒక ఆస్ట్రేలియన్ క్రికెటర్ కి పెద్ద ఫ్యాన్. తనని కలుసుకోవాలని చాలారోజుల నుండి అనుకుంటోంది. మొత్తానికి ఆమె అతనిని కలుసుకొంది. ‘నేను క్రికెట్ ఫాలో అవ్వను. కాబట్టి నేను ఏ టీంకి సపోర్ట్ చేయను. కాని నేను నా స్కూల్ డేస్ లో ఆదివారాల్లో కేవలం క్రికెట్ మీదవున్న ఇష్టంతో ఫీల్డింగ్ చూసే దాన్ని’ అని తాప్సీ కొద్ది రోజులకు ముందు ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మొత్తానికి ఆమె ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ని చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ కోల్ కత్త నైట్ రైడర్స్ మద్య చెన్నై లో మ్యాచ్ జరిగినప్పుడు కలుసుకుంది. ఫస్ట్ ఇన్నింగ్ అయిపోగానే తాప్సీ బ్రెట్ లీ ని కెమెరా ముందు మాట్లాడడానికి పిలిచింది. తనతో మాట్లాడడం చాలా సంతోషంగా వుందని చెప్పింది. ప్రస్తుతం తాప్సీ చెన్నై లో మూని 3 సినిమా షూటింగ్ లో బిజీ గా వుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తూ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

Exit mobile version