అజిత్ సరసన నటించబోతున్న తాప్సీ?

అజిత్ సరసన నటించబోతున్న తాప్సీ?

Published on May 13, 2012 8:11 PM IST


విష్ణు వర్ధన్ దర్శకుడిగా అజిత్ హీరోగా చేస్తున్న చిత్రంలో తాప్సీ నటించబోతుందా? తాజా పుకార్ల ప్రకారం అవుననే చెప్పాలి కొద్ది రోజుల క్రితం అజిత్ విష్ణువర్ధన్ తో కలిసి యాక్షన్ చిత్రం చేయ్యనున్నట్టు ప్రకటించారు. గతం లో వీరి కలయికలో వచ్చిన “బిల్లా” చిత్రం తమిళం లో భారీ విజయం సాదించింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రకు నయనతార పచ్చ జెండా ఊపింది. తాజాగా చిత్రంలో మరో కీలక పాత్ర కోసం తాప్సీ ని తీసుకున్నారు.ప్రముఖ పాత్రికేయుడు నిఖిల్ మురుగన్ ఈ విషయాన్నీ దృవీకరించారు. ఏ.యం.రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. తప్సీ గతంలో “ఆడుకాలం” మరియు “వందాన్ వెండ్రాన్” చిత్రాలలో నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు