నయనతార మరియు ఆర్యలతో చనువుగా ఉంటున్న తాప్సీ


తాప్సీ ఈ మధ్యన ఎక్కువ పుకార్లతో స్నేహం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే తను నటించిన చిత్రాలలో సహా నటులతో ఈమెకి సంభంధలున్నట్టు పలుమార్లు పుకార్లు వచ్చాయి. ప్రస్తుతం కోలివుడ్లో నడుస్తున్న పుకార్లు బట్టి తన రాబోతున్న చిత్రంలో తన సహా నటుడు ఆర్యతో కలిసి పలు సందర్భాలలో కనిపించినట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా ఒక ప్రముఖ తమిళ పోర్టల్ తాప్సీ నయనతారతో కూడా బాగా చనువుగా ఉంటున్నారని తెలిపింది. ఇదే కాకుండా గతంలో మంచు మనోజ్ మరియు ఆది పినిశెట్టిలతో కూడా చనువుగా ఉన్నట్టు వాళ్ళు చెప్పారు. వాళ్ళతో చనువుగా ఉండటంలో ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు. ప్రస్తుతం తను వెంకటేష్ సరసన “షాడో” చిత్రంలో నటిస్తుంది. ఇది కాకుండా చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుంది.

Exit mobile version