యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క ల కాంబో అంటే ఎనలేని క్రేజ్ ఉంది. కాంబోలో ఓ సినిమా వస్తుంది అంటే చాలా మంది మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే ఇప్పుడు వీరు తమ తమ ప్రాజెక్టులతో ఎవరికి వారు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వీరిద్దరికీ ఎలాంటి క్రేజ్ ఉందో కూడా అందరికీ తెలిసిందే.
లేటెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ పేస్ బుక్ ఫాలోవర్స్ ను రికార్డు స్థాయిలో పెంచుకుంటూ వెళ్తూ ఒక్కో మైల్ స్టోన్ ను అందుకుంటుండగా ఇప్పుడు స్వీటీ కూడా పేస్ బుక్ ఫాలోవర్స్ తో ఒక్కో మైల్ స్టోన్ ను అందుకుంటూ వస్తుంది. ఇపుడు తాజాగా అనుష్క పేస్ బుక్ పేజ్ 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ నుంచి 21 మిలియన్ మార్క్ దగ్గరకు చేరుకుంది. ఈమె పేజ్ కు కూడా ప్రభాస్ లానే లైక్స్ కంటే ఫాలోవర్సే అత్యధికంగా ఉండడం గమనార్హం. ప్రస్తుతం అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ “నిశ్శబ్దం” కరోనా తగ్గినా అనంతరం విడుదలకు సిద్ధంగా ఉంది.