మలయాళం చిత్రానికి ఓకే చెప్పిన స్వాతి

First Posted at 01.10 on Apr 18th

colors_swathi
స్వాతి ప్రస్తుతం చాలా మంచి జోరులో వుంది. తన తాజా చిత్రం ‘స్వామి రా రా ‘ పెద్ద విజయం సాధించింది. అంతేకాకుండా మలయాళం చిత్రపరిశ్రమలో కూడా ప్రవేశించనుంది. తన మొదటి చిత్రం ‘ఆమెన్’లో ఓ క్రిస్టియన్ అమ్మాయి పాత్రలో నటించింది. ఏడాదిలోనే చాలా మంచి చిత్రంగా అభివర్నింపబడిన ఈ చిత్రం తర్వాత స్వాతిని చాలా అవకాశాలు ముంచెత్తుతునాయి. తాజా సమాచారం ప్రకారం ‘లండన్ బ్రిడ్జి’ చిత్రంలో ప్రిథ్వి రాజ్ సరసన జతకట్టనుంది. అనిల్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా భాగం ఇంగ్లండ్లో చిత్రీకరింనున్నారు. ఈ చిత్రం షూటింగ్ జూన్ 5న మొదలు కానుంది. మలయాళం చిత్ర పరిశ్రమలో ప్రిథ్వి రాజ్ చాలా పెద్ద హీరో, అలాంటి హీరో పక్కన తన మలయాళ కెరీర్ ప్రారంభంలోనే ఛాన్స్ దక్కించుకోవడం తన కెరీర్ కి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఓ తమిళ్ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్న స్వాతి త్వరలో నవదీప్ సరసన ‘బంగారు కోడి పెట్ట’ లో కనపడనుంది .

Exit mobile version