10కోట్ల మార్క్ ను చేరుకున్న ‘స్వామీ రారా’

Swami-Ra-Ra
ఈ సమ్మర్ సీజన్లో అందరిని ఆశ్చర్యపరిచే విదంగా సూపర్ హిట్ సాదించిన సినిమా ‘స్వామీ రారా’. ఈ సినిమా మల్టీప్లెక్స్ లకు వచ్చే వారిని ఎక్కువగా ఆకర్షించడం, పెద్దవారికి నచ్చే విదంగా వుండడం వల్ల మంచి విజయాన్ని సాదించింది. ఈ సినిమా 10 కోట్ల మార్క్ ని చేరుకుందని ట్రేడ్ నిపుణులు తెలియజేశారు. ఈ సినిమా విడుదలై మూడు వారాలు అవుతున్న సినిమా థియేటర్స్ లో ఇంకా మంచి కలెక్షన్ లతో నడుస్తోంది. నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని చక్రి చిగురుపాటి నిర్మించగా సుదీర్ వర్మ దర్శకత్వం వహించాడు. సన్నీ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశాడు. ఈ సినిమా మొత్తం నిఖిల్, స్వాతిల చుట్టూనే తిరుగుతుంది. గత కొద్ది కాలంగా విజయంలేని వీరికి ఈ సినిమా విజయన్ని సాదించడంతో వారు చాలా సంతోషంగా వున్నారు.

Exit mobile version