ఈ సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విడుదలకు దగ్గిర పడింది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు నిన్న పూర్తయిన విషయం తెలిసిందే. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ ప్రింట్స్ ఈ రోజు రాత్రికి బయల్దేరాయి. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ద్వారా ఈ ప్రింట్స్ వెళ్ళిపోయాయి. దాదాపు 100కి పైగా స్క్రీన్స్ లో ప్రదర్శించబోతున్నారు. ఓవర్సీస్ లో మహేష్ బాబు సినిమాలకి కక్రేజ్ చాలా ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అక్కడి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో ప్రీమియర్ షో టికెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.