వెంకీ పుట్టిన రోజున సీతమ్మ వాకిట్లో.. ఆడియో

విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా తెరకెక్కుతున్న ”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భద్రాచలం సెట్లో జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర ఆడియో నవంబర్లో తిరుపతిలో విడుదల కానుంది అనే ఒక రూమర్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ఆడియో వెంకటేష్ గారి పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ కుటుంబ కథా చిత్రంలో ప్రకాష్ రాజ్ మరియు జయసుధ కీలక పాత్రలు పోషించారు, సమంత మరియు అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి కె.వి గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2013 జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version