రామోజీ ఫిలిం సిటీ లో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”

రామోజీ ఫిలిం సిటీ లో “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు”

Published on Mar 15, 2012 8:38 AM IST


“సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” పరిశ్రమ లో అత్యంత వేచి చూస్తున్న చిత్రం ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీ లో జరుపుకుంటుంది ఈ చిత్రీకరణ లో ప్రధాన పాత్రలు పాల్గొంటున్నాయి. ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ మరియు మహేష్ బాబు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు ఈ చిత్రం మీద ఇప్పటికే భారి అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు ఈ చిత్రం మీద పూర్తి నమ్మకంతో ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కి జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరణ తరువాత ఈ చిత్ర బృందం పూణే కి వెళ్లనుంది . ఈ చిత్రం దసరా కి విడుదల చెయ్యడానికి సిద్దం చేస్తున్నారు ఈ చిత్రం లో సమంత మరియు అంజలి లు కథానాయికలుగా నటిస్తున్నారు.

తాజా వార్తలు