నైజాంలో ఫస్ట్ వీక్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘సీతమ్మ వాకిట్లో..’

నైజాంలో ఫస్ట్ వీక్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ‘సీతమ్మ వాకిట్లో..’

Published on Jan 20, 2013 12:30 AM IST

SVSC
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా నైజాంలో ఎంతో విజయవంతంగా ప్రదర్శించబడుతూ బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ అదరగొడుతోంది. ఈ సినిమా నైజాంలో మొదటివారం సుమారు 10.08 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఈ ఏరియాలో ఇంతకముందు ఉన్న రికార్డ్ ను బద్దలు కొట్టింది. విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా నటించిన మల్టీస్టారర్ కావడంతో ఈ సినిమాకి మొదటి నుంచి భారీగా క్రేజ్ ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచే కాక, యంగ్ జెనరేషన్ నుండి కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అన్ని ఓవర్సీస్ ఎరియాల్లోనూ సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది, ఇప్పటికే అమెరికాలో అతడిక కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాగా రికార్డు సాదించింది. సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించగా, శ్రీ కాంత్ అడ్డాల డైరెక్ట్ చేసారు.

తాజా వార్తలు