విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఈ స్టార్ హీరోలిద్దరూ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాని మొదటగా సెప్టెంబర్ 28న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావించారు. అయితే అనుకున్న సమయానికి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. షూటింగ్ షెడ్యూల్స్ ఆలస్యమవుతుండడం, షూట్ చేయాల్సిన పార్ట్ ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల ఈ చిత్రం అక్టోబర్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇటీవల వెంకటేష్, అంజలి లపై అహోబిలంలో షూటింగ్ సమయంలో సెట్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన సమంతా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య పాత్రలు పోస్గిస్తున్నారు.