కొత్త రికార్డ్ సృష్టించనున్న సీతమ్మ వాకిట్లో…

SVSC
మహేష్ బాబు, వెంకటేష్ ప్రధాన పాత్రలలో రానున్న “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తెలుగు పరిశ్రమలో నూతన రికార్డు నెలకొల్పడానికి సిద్దమయ్యింది. న్యూ యార్క్ , టైమ్స్ స్క్వేర్ లోని AMC థియేటర్లో ప్రదర్శించబడుతున్న మొదటి తెలుగు చిత్రం కానుంది. మాములుగా ఇక్కడ హై బడ్జెట్ హాలివుడ్ చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తుంటారు. అమెరికా లో ఈ చిత్రాన్ని 14 రీల్స్ వారు ఫికస్ వారితో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా అనిల్ సుంకర ట్విట్టర్లో తెలిపారు. “చాలా వరకు హాలీవుడ్ ప్రీమియర్లు ప్రదర్శించే AMC ధియేటర్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని విడుదల చెయ్యడం నిజంగా చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.

మహేష్ బాబు, వెంకటేష్ నటిస్తున్న ఈ చిత్రంలో వీరి సరసన సమంత మరియు అంజలి కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రం ఈ వారంలో చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకునుంది. ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం 11జనవరి ,2013 విడుదల కానుంది.

Exit mobile version