సెకండ్ వీక్ కూడా దూసుకుపోతున్న సీతమ్మ వాకిట్లో..

సెకండ్ వీక్ కూడా దూసుకుపోతున్న సీతమ్మ వాకిట్లో..

Published on Jan 21, 2013 10:58 AM IST

SVSC
విక్టరీ వెంకటేష్ – సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద రెండవ వారం కూడా విజయవంతంగా దూసుకుపోతోంది. వారాంతంలో అన్ని ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ లో తెలుగు టాప్ గ్రాసర్ గా నిలిచి అల్ టైం రికార్డు సృష్టిస్తుందని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం భావిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో అత్యధిక కలెక్షన్ సాదించిన తెలుగు సినిమాగా నమోదైంది, అలాగే మరికొన్ని ఓవర్సీస్ లలో కూడా రికార్డ్ సృష్టించింది.

శ్రీ కాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం, స్టార్ హీరోలు ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడటానికి ఎగబడుతున్నారు. అందుకే బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. సమంత, అంజలి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.

తాజా వార్తలు