First Posted at 11:48 on Apr 21st
తెలుగు లో వచ్చిన ఇద్దరు అగ్రహిరోలు నటించిన సినిమా ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ . ఈ సినిమా బాక్స్ ఆఫీసు ఈ రోజుతో 100రోజులు పూర్తిచేసుకుంది. ఈ రోజుల్లో చాలా తక్కువ సినిమా లు మాత్రమే థియేటర్స్ లో ఎక్కువ రోజులు ప్రదర్శించబడుతున్నాయి. ఇలాంటి వాటిలో ఈ సినిమా ఒకటి.
చాలా రోజుల తరువాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమా మరోసారి టాలీవుడ్ లో మల్టీ స్టార్ కాన్సెప్ట్ ను తీసుకోచ్చింది. డీసెంట్ కథతో ఈ సినిమాను నిర్మించి ప్రేక్షకులకు అందించారు. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులు నటించగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించాడు.