రికార్డు స్థాయిలో విడుదల కానున్న సీతమ్మ వాకిట్లో .. – నాయక్

రికార్డు స్థాయిలో విడుదల కానున్న సీతమ్మ వాకిట్లో .. – నాయక్

Published on Jan 3, 2013 4:43 PM IST

svsc-and-nayak
టాలీవుడ్ రెండు పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. అందులో ఒకటి ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కాగా మరొకటి మాస్ ఎంటర్టైనర్ ‘నాయక్’. రెండూ భారీ బడ్జెట్ సినిమాలు మరియు ఈ సినిమాలపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాలను హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కావడం, అలాగే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి నిర్మాత కూడా దిల్ రాజునే కావడం విశేషం.

ఈ రెండు సినిమాల విడుదలకి మధ్య కొన్ని రోజులే గ్యాప్ ఉంది. ఈ రెండు సినిమాలను మొదటి రోజు ఎన్ని థియేటర్లు కుదిరితే అన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ మొదటి రోజు హైదరాబాద్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన సినిమా ‘బిజినెస్ మేన్’. చూస్తుంటే ఫెస్టివల్ సందర్భంగా ఈ థియేటర్ల విషయంలో భారీ ఒత్తిడి నెలకొంది .

తాజా వార్తలు