ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు చిత్రాలు ఒకే చేసారు. అందులో ఒక రెండు చిత్రాలు ఆల్రెడీ షూటింగ్ మొదలయ్యాయి. అవే ఒకటి దర్శకుడు శ్రీరామ్ వేణుతో తీస్తున్న రీమేక్ చిత్రం “వకీల్ సాబ్” మరొకటి విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో తీస్తున్న ఒక పీరియాడిక్ చిత్రం. అయితే వీటిలో కూడా వకీల్ సాబ్ దాదాపు 90 శాతం వరకు చిత్రీకరణ పూర్తి కాగా క్రిష్ తో చిత్రం కొంచెం పూర్తయ్యింది.
అయితే గత కొన్నాళ్ల కితం ఈ రెండు చిత్రాలకు సంబంధించి బజ్ వినిపించింది. పవన్ పుట్టినరోజున వకీల్ సాబ్ టీజర్ ను అలాగే క్రిష్ చిత్రానికి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం అందుకు సంబంధించి సంకేతాలు మాత్రం ఎక్కడా కనబడడం లేదు. ఈ నెల ఎలాగో పూర్తి కావస్తుంది. కానీ చిత్ర యూనిట్ నుంచి కూడా ఎలాంటి కదలిక లేదు.
ఒకవేళ వస్తే వకీల్ సాబ్ టీం నుంచి మోషన్ పోస్టర్ గాని లేదా టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తుంది. అలాగే పాటను కూడా ఏమన్నా ప్లాన్ చేస్తున్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం పవన్ పుట్టినరోజు దగ్గర పడుతున్న సందర్భంలో ఈ రెండు సినిమాలపై ఒకరకమైన సస్పెన్స్ నెలకొంది.