“అడ్డా” అనే పేరుతో సుశాంత్ హీరోగా తెరకెక్కుతుంది. ఈ చిత్రం మొదలయినప్పటి నుండి చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటూ వచ్చింది తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో సగ భాగం చిత్రీకరణ పూర్తి అయ్యింది. ఈ చిత్రంలో ఒక పాట కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక భారీ సెట్ ని నిర్మించారు. ఈ చిత్రంలో సుశాంత్ విభిన్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం దర్శకుడు సాయి రెడ్డి ఒక సంవత్సరం పైగా కష్టపడ్డారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు ప్రకటించాల్సి ఉంది.