తమిళ స్టార్ సూర్య నటించిన సినిమా ‘యముడు’ ఆంద్ర ప్రదేశ్ లో భారీ విజయాన్ని సాదించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ సూర్య ‘యముడు-2’ గా మరో సినిమాని తెరకేక్కిసుతున్నారు. ఈ సినిమాని ఈ నెల 28న విడుదలచేయాలనుకుంటున్నారు. అనుష్క, హన్సిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో అంజలి ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ ని కేరళ, చెన్నై, హైదరాబాద్ మొదలగు ప్రాంతాలలో నిర్వహించారు. అలాగే కొన్ని పాటలని మలేషియా, సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానేవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. సూర్యకి ఆంద్ర ప్రదేశ్ లో మంచి మార్కెట్ ఉండడంతో ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.