సూర్య రాబోతున్న చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం “సింగం” చిత్రానికి సీక్వెల్ అయిన “సింగం 2” దక్షిణాఫ్రికాలో చిత్రీకరణ జరుపుకోనుంది. అనుష్క మరియు హన్సిక మోత్వాని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు అక్కడికి చేరుకున్నారు.ప్రస్తుతం లోకేషన్ల వేటలో ఉన్నారు. ఈ చిత్ర చిత్రీకరణ మొత్తం 108 రోజుల్లో పూర్తి చేస్తాను అని సూర్యకి మాట ఇచ్చారు స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నారు. “సింగం” చిత్రాన్ని తెలుగులో “యముడు”గా అనువదించారు ఇక్కడ ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం మళ్ళి జతకట్టడం ఆసక్తికరం. “సింగం 2” చిత్రం తెలుగులో కూడా 2013లో విడుదల చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచానున్నారు. సూర్య నటించిన “మాత్రాన్(బ్రదర్స్)” అక్టోబర్ 12న తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది.