సూర్య – సమంతల ‘అంజాన్’ రిలీజ్ డేట్?

సూర్య – సమంతల ‘అంజాన్’ రిలీజ్ డేట్?

Published on Jan 29, 2014 6:00 PM IST

Surya-Samantha-Film
తమిళ్ స్టార్ హీరో సూర్య గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్న సినిమా ‘అంజాన్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతోంది. మొదటి సారి సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి ఎన్. లింగుస్వామి డైరెక్టర్. ఈ చిత్ర టీం మూవీ రిలీజ్ కోసం తేదీని ఫైనలైజ్ చేసారు. ఆగష్టు 15న ఈ సినిమాని రిలీజ్ చేయడానికి వారు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

ఇప్పటి వరకు 40% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలోని విజిలింగ్ ఉడ్స్ క్యాంపస్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక మహారాష్ట్రలో మిగిలిన భాగాన్ని చిత్రీకరించనున్నారు. సూర్య చాలా స్టైలిష్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాకి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తుండగా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

తాజా వార్తలు