అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన భారీ చిత్రం “ఏజెంట్” కోసం తెలియని వారు ఉండరు. మన టాలీవుడ్ స్టైలిష్ ఫిలిం మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ పై అప్పట్లో ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఒక మూమెంట్ లో ఈ సినిమా కానీ ఆన్ టైం రిలీజ్ అయ్యి ఉంటే ఊహించని ఓపెనింగ్స్ ని కూడా సెట్ చేసి ఉండేది అనే రేంజ్ లో ఈ చిత్రానికి ట్రేడ్ సర్కిల్స్ లో టాక్ నడిచింది.
కానీ అలా ఆలస్యం అవుతూ ఫైనల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రానికి నిరాశే మిగిలింది. ఇక ఈ తర్వాత ఓటిటి రిలీజ్ అయితే పెద్ద సస్పెన్స్ అని చెప్పాలి. ఈ సినిమా హక్కులు సోనీ లివ్ వారు సొంతం చేసుకోగా పలుమార్లు డేట్స్ ఇచ్చి కూడా వాయిదా వేశారు. దీనితో ఏజెంట్ ఓటిటి రిలీజ్ పట్ల కూడా మంచి ఆసక్తి నెలకొనగా ఇపుడు సర్ప్రైజింగ్ గా సోని లివ్ వారు సరికొత్త డేట్ ని అనౌన్స్ చేశారు.
దీనితో ఈ సినిమా ఈ మార్చ్ 14 నుంచి సోనీ లివ్ లో హిందీ మినహా మిగతా భాషల్లో అందుబాటులోకి రానున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈసారి అయినా అనుకున్నట్టుగా ఏజెంట్ ఎంట్రీ ఉంటుందా లేదా అనేది ఆ రోజు వరకు ఆగి చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు ఆలాగే ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.
Spy mode ????
The mission is LIVE! Adrenaline-pumping action meets next-level style.
Watch the most stylish spy-action entertainer, Agent, streaming from 14 March only on Sony LIV.#Agent #AgentOnSonyLIV @AkhilAkkineni8 @mammukka #SakshiVaidya #SurenderReddy #DinoMorea pic.twitter.com/dyP2UHbAN0— Sony LIV (@SonyLIV) March 5, 2025