ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం తమిళ్ హీరో సూర్య, అనుష్క, హన్సిక హరో హీరోయిన్స్ గా నటించిన సింగం(యముడు 2) జూలై కి వాయిదా పడిందని అంటున్నారు. ముందుగా ఈ సినిమాని జూన్ 28న రిలీజ్ చేయాలనుకున్నారు. అదే రోజున రవితేజ నటించిన ‘బలపు’, మరికొన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ కారణాల వల్ల ‘సింగం’ సినిమాని జూలైలో రిలీజ్ చేసే విధంగా పావులు కదుపుతున్నారు. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
హరి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. సూర్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలోని కొంత భాగాన్ని సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించారు. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోని జూన్ మిడిల్ లో రిలీజ్ చేయనున్నారు.