తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా, సమంత హీరోయిన్ గా నటిస్తున్న ‘అంజాన్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్. లింగుస్వామి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని తిరుపతి బ్రదర్స్ – యుటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ వారు కలిసి నిర్మిస్తున్నారు.
గత కొద్ది రోజులు వరకు ఈ సినిమా ముంబైలోని కొన్ని లోకేషన్స్ లో షూట్ చేసారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ మహారాష్ట్రలోని పంచగనికి షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ సూర్య – సమంతలపై ఓ పాటని షూట్ చేస్తున్నారు. సూర్య గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ మూవీకి సంతోష్ శ్రీనివాస్ సినిమాటోగ్రాఫర్. యువన్ శంకర్ రాజ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది.